ISIS ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కర్ణాటక, మహారాష్ట్రలో దాడులు చేపట్టింది. ఇవాళ ఉదయం ఇరు రాష్ట్రాల్లో 40 చోట్ల దాడులు నిర్వహిస్తోంది.
కర్ణాటకలో 1, పూణెలో 2, రూరల్ థానేలో 31, థానేలో 9, భయాందర్లో 1 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కుట్రకు సంబంధించి ఇప్పటి వరకు 13 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు.