‘మేకిన్ ఇండియా’ తరహాలో ‘వెడ్ ఇన్ ఇండియా’ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని, డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు బదులు దేశంలోనే వివాహాలు జరుపుకోవాలని ధనికులను కోరారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో 2 రోజుల పాటు జరిగే ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ని నిన్న మోదీ ప్రారంభించారు.