ఏపీపీఎస్సీ త్వరలోనే వంద గ్రూప్–1 పోస్టులతో పాటు డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్స్‌తో మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. గతేడాది ఎలాంటి వివాదాలకు తావులేకుండా గ్రూప్–1 నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలల కాలంలోనే పారదర్శకంగా మెయిన్స్ ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. పలు న్యాయపరమైన వివాదాలను అధిగమించి గత నాలుగేళ్లల్లో సంస్కరణలు తెచ్చిన కమిషన్ తాజాగా గ్రూప్–2 పోస్టుల భర్తీని సైతం పారదర్శకంగా, 6 నెలల వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది.