తుపాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటానని, ఏ నష్టం జరగదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని, మీ ఇంటికి వలంటీర్, సచివాలయ సిబ్బంది వచ్చి మంచి చేస్తారని తెలిపారు. ఈ నాలుగైదు రోజుల్లో భారీ వర్షం కురిసిందని, మనకు వచ్చిన కష్టం.. మనకు వచ్చిన నష్టం వర్ణణాతీతమే అన్నారు. వరుసగా వర్షాలు పడటంతో రైతులు నష్టపోయారని తెలిపారు. పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ తిరుపతి జిల్లాల్లో పర్యటించారు. మిఛాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెంలో స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం బాధితులతో సమావేశమై వారి కష్టాలు, నష్టాలను తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని సీఎం వైయస్ జగన్ హామీ ఇచ్చారు.