తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మతి చెడింది. అతను మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా మాట్లాడుతున్నాడు. జనసేన పార్టీకి తెలంగాణలో దక్కిన ఓట్లశాతం చూసి అతను మతిస్థిమితం కోల్పోయాడేమోనని ప్రజల్లో చర్చ మొదలైంది. కనీనం, స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా తన పార్టీకి రాలేదనే మనస్తాపం పవన్‌కళ్యాణ్‌ను వెంటాడుతుందేమో.. కారణాలేమైనా.. నిన్న విశాఖపట్నంలో ఆయన ప్రసంగం తీరుకు రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు అని మంత్రి అమర్నాథ్ అన్నారు.