అభ్యర్థుల అభ్యర్థన, సౌలభ్యం మేరకు గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2.30 గంటల్లో ఓఎంఆర్ షీట్‌పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో పేపర్–1, పేపర్–2లో 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. పరీక్ష సిలబస్‌ను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఖాళీలు, వేతనం, వయసు, విద్యార్హతలతో పాటు పూర్తి సమాచారం కోసం కమిషన్ వెబ్‌సైట్ http://www.psc.ap.gov.inలో చూడవచ్చు.