అనంతపురంలోని అశోక్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి శనివారం పరిశీలించారు. అశోక్ నగర్ మొదటి క్రాస్‌కు వెళ్లేందుకు దారి సరిగా లేకపోవడంతో అధికారులతో మాట్లాడారు. ఇక్కడ వాహన రాకపోకలు సాగేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగా అలైన్మెంట్ చేయాలన్నారు. అదేవిధంగా డ్రెయినేజీలో మురుగునీరు సాఫీగా ముందుకు సాగేలా చూడాలన్నారు.