శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్లకు 9 కిలో మీటర్ల దూరంలోని కొండాపురంలో ప్రాచీన వైష్ణవాలయం పెద్ద వీరగల్లు శాసనాన్ని గుర్తించినట్టు చరిత్రకారుడు మైనా స్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండాపురం గ్రామానికి తూర్పు వైపున ఒక వైష్ణవాలయం పూర్తిగా పాడుబడిన స్థితిలో ఉండడాన్ని గుర్తించినట్టు చెప్పారు. విజయనగర సామ్రాజ్య కాలంలో ఆ గుడిని కట్టించినట్టు నిర్మాణ రీతిని బట్టి చెప్పవచ్చని మైనా స్వామి పేర్కొన్నారు.