కారంచేడు గ్రామంలోని బ్రహ్మంగారి గుడి వెనుక ఉన్న ఎన్టీఆర్ కాలనీలో ఇటీవలి వానలకు మోకాళ్ళ లోతు నీళ్లు నిలువ ఉండి మురుగునీరు చేరి దోమల బెడదతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పంచాయతీ అధికారులు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని, మొన్న వచ్చిన తుఫాను కారణంగా ఇళ్లల్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడిందని, దోమకాటు కు గురై అంటువ్యాధులు కూడా ప్రబలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.