చెన్నేకొత్తపల్లిమండలం ఆమిదాలకుంట గ్రామానికి చెందిన మౌనిక (26) అనే వివాహిత ఆదివారం కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో విష ద్రావకం తాగింది. కొద్దిసేపటి తరువాత కుటుంబ సభ్యులు గమనించి బాధితురాలు మౌనికను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు.