ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తూర్పుగోదావరి జిల్లాలో కన్నకూతురిపై తండ్రి అత్యాచారయత్నం,,,,దేహశుద్ది చేసిన స్థానికులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 10, 2023, 07:37 PM

ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. నిత్యం ఎక్కడోచోట ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వావివరసలు మరిచి కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురిపైనే ఓ తండ్రి అత్యాచారానికి యత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలు విభేదాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. వారి కుమార్తె (7) తల్లి వద్దే ఉంటుంది. సదరు తండ్రి శనివారం (డిసెంబర్ 9) వాళ్ల ఇంటికి వచ్చి కుమార్తెను పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఆపై చిన్నారి మీద అత్యాచారానికి యత్నిస్తుండగా.. స్థానికులు గమనించారు. తండ్రిని పట్టుకొని చితకబాదారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com