మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీ హిల్ జిల్లాలోని మల్లిన్నోంగ్ గ్రామం ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరుగాంచించింది. ఇది ఇండో-బంగ్లా సరిహద్దుకు సమీపంలో షిల్లాంగ్ నుంచి 90 కి.మీ దూరంలో ఉంది.
ఈ గ్రామంలో 100 శాతం అక్షరాస్యత కలిగి ఉండటంతో పరిసరాలపై అవగాహన ఉండి ప్లాస్టిక్ కవర్లు, ధూమపానం వంటి వాటిపై నిషేధం విధించారు. ఈ గ్రామంలోని ప్రజలు మాతృస్వామ్య వ్యవస్థను పాటిస్తుండటం ఇక్కడి ప్రత్యేకత.