బెలగావికి చెందిన 24 ఏళ్ల యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో ప్రియుడు యువతిని తీసుకుని పరారయ్యాడు. ఆ తర్వాత యువతి తరఫున దాదాపు 8 నుంచి 10 మంది వ్యక్తులు యువతి తల్లిపై దాడి చేశారు.
యువకుడి తల్లిని స్తంభానికి కట్టేసి దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెలగావిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు.