మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. రైలులో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. రైలు బోగీలో ఒక మహిళ మాత్రమే ఉండడంతో కమలేష్ కుష్వాహ అనే వ్యాపారి ఆమెపై కన్నేశాడు. ముందుగా తలుపులన్నీ మూసేసి ఆ మహిళపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత నిందితుడు మహిళను సాత్నా స్టేషన్‌లో దించి మళ్లీ బోగీ తలుపులు మూసుకున్నాడు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.