ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. షేక్పూర్ గ్రామానికి చెందిన ముస్కాన్ అనే యువతి తన ప్రియుడికి ఫోన్లో మెసేజ్లు పంపుతోంది. అలా చేయొద్దని ఆమెను సోదరుడు ఆదిత్య హెచ్చరించాడు.
తన మాట వినకపోవడంతో సోదరితో ఆదిత్య గొడవపడ్డాడు. కోపంలో కంట్రీ మేడ్ పిస్టల్ తీసి తన సోదరిని కాల్చిచంపాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.