మెట్ట ప్రాంత రైతాంగ అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. సోమశిల జలాశయంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికి మెట్ట ప్రాంత రైతాంగం పరిస్థితిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రాంత రైతులకు నీటిని అందచేస్తున్నట్లు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. సోమవారం సోమశిల జలాశయం ఉత్తరకాలువ ద్వారా నీటి విడుదలను ఆయన ప్రారంభించారు. తొలుత జలాశయం ఉత్తరకాలువ వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి నీటి విడుదలను స్వీచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో 20 రోజుల క్రితం సోమశిల జలాశయంలో 26 టీయంసీల నీటి నిల్వ ఉన్న సమయంలో ఆత్మకూరు నియోజకవర్గ రైతాంగం కోసం నాలుగు టీయంసీల నీటిని అందించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించామని, ఆయన సహృదయంతో అన్నమయ్య నుండి 2 టీయంసీలు, జలాశయం మిగులు జలాల నుండి ఒక టీయంసీ నీటిని నియోజకవర్గ రైతాంగానికి అందచేసేందుకు అంగీకరించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు.