వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. నేడు అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3.45 గంటలకు పాతబస్టాండ్ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బస్సు యాత్రలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీలు మిథున్‌రెడ్డి, నందిగం సురేష్, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక పాల్గొంటారు.