ఆడుదాం ఆంధ్ర పేరుతో విశాఖపట్నంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు.
అంబటి రాయుడు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అద్భుతమైన కార్యక్రమం అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదన్నారు. సీఎం జగన్ క్రీడలను ప్రొత్సహించేందుకు అద్భుతమైన కార్యక్రమం తీసుకువచ్చారన్నారు.