తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు టీటీడీ నిధుల మళ్లింపుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. టెండర్ ఫైనల్ చేసినా నిధుల విడుదల తక్షణం ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.
విడుదల చేయడం ఎండోమెంట్ యాక్ట్ కు విరుద్ధమని పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు టీటీడీ అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.