బీహార్లోని వైశాలి జిల్లాలో దారుణం జరిగింది. 24 ఏళ్ళ యువతి వివాహం చేసుకోవడానికి, యువకుడు ఒప్పుకోలేదని 22 ఏళ్ళ యువకుడిపై యాసిడ్ పోసింది. దీనివల్ల అతని ముఖం కాలిపోయింది. ఆ బాధితుడు ధర్మేంద్ర కుమార్ అని పోలీసులు గుర్తించారు.
ఆ బాధితుడికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఆ యువతిని అరెస్టు చేశారు. వారిద్దరికీ ముందుగానే పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.