రాష్ట్ర డీజీపీ కార్యాలయం, సీఐడీ అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఆపరేషన్ స్వేచ్ కార్యక్రమంలో భాగంగా పలు దుకాణాల్లో పనిచేస్తున్న 55 మంది బాల కార్మికులను విముక్తి కల్పించినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మంగళవారం తెలిపారు.
నవంబరు 20 నుంచి ఈనెల 10 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, ఏహెచ్ఐటీయూ సిబ్బంది, ఇతర అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు.