లోక్సభలో ఇవాళ ఆగంతకులు చొరబడడంపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఈ ఘటనపై సంపూర్ణ దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు. దుండగుడు సభలో ప్రయోగించిన ఆ స్మోక్ ఏంటనేది తెలుసుకుంటున్నాం.
ఆ స్మోక్ సాధారణమైనదేనని విషపూరితమైనది కాదని ప్రాథమికంగా తేలిందని చెప్పారు. ‘ఘటనకు నాదే బాధ్యత. ఎవరు వచ్చారు.. ఎవరి సిఫారసు పాస్ మీద వచ్చారు.. వీటికి నేనే జవాబుదారీ. పార్లమెంటు భవన కస్టోడియన్గా నేను బాధ్యత వహిస్తాను’ అని తెలిపారు.