పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని దారాబన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సైనిక స్థావరంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
మంగళవారం తెల్లవారుజామున ఆరుగురు ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కును ఆర్మీ బేస్‌లోని భవనంలోకి ఢీకొట్టారు. ఈ ఘటనలో 23 మంది సైనికులు మృతి చెందినట్లు సైన్యం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa