మాజీ మంత్రి పరిటాల రవీంద్ర చిత్రంతో ముద్రించిన ఇత్తడి నాణెనాన్ని మాజీ మంత్రి పరిటాల సునీత వెంకటాపురంలో మంగళవారం విడుదల చేశారు. పరిటాల రవీంద్ర భౌతికంగా దూరమై ఏడు వేల రోజులు అయిన సందర్భంగా గుంటూరు, విజయవాడకు చెందిన ఆయన అభిమానులు ఆయన స్మారక నాణేన్ని రూపొందించారు. వెంకటాపురానికి వచ్చి పరిటాల రవీంద్ర ఘాట్‌కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పరిటాల సేవలను, పరిటాల రవీంద్ర ట్రస్టు ద్వారా చేపడుతున్నట్టు సేవా కార్యక్రమాలను కొనియాడారు. పరిటాల రవీంద్రను ఎన్నటికీ మరువలేమని అన్నారు.