ఆర్టీసీలో పనిచేసి రిటైరైన ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని ఎనఎంయూ కర్నూలు జిల్లా కార్యదర్శి పీఎస్ఎం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఎనఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం పీలేరు డిపో ముందు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఎనఎంయూ నాయకులు సీవీ రమణ, సుబ్బరామయ్య, ఆనంద, బీఆర్ నాయక్, ఎం.హెచ.నాయుడు, ఆదిరెడ్డి, రఫీ, తదితరులు పాల్గొన్నారు.