పోలీసులకు దొరకకుండా 30 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న సిద్దె వెంకటరమణ(52) అనే దొంగను మంగళవారం అరెస్టు చేసినట్లు కడప జిల్లా, గుర్రంకొండ ఎస్‌ఐ దిలీప్‌కుమార్ తెలిపారు. కురబలకోట మండలం సిద్దేవారిపల్లెకు చెందిన నర సింహులు కుమారుడు సిద్దె వెంకటరమణ దొంగతనాలు చేస్తూ పలు కేసుల్లో పట్టుబడ్డాడు. ఈ క్రమంలో నిందితుడిపై గుర్రం కొండ పోలీస్ స్టేషనలో క్రైమ్ నెంబరు 13/1992లో కేసు నమో దైంది. అప్పటిలో నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో బెయిల్‌పై బయటకు వచ్చిన అతను కోర్టుకు హాజరుకాకుండా 32 ఏళ్లుగా బయటున్నాడు. ఈ క్రమం లో అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు రాయ చోటి డీఎస్పీ మహబూబ్‌బాష ఆధ్వర్యంలో గుర్రంకొండ ఎస్‌ఐ దిలీప్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయ గా సాంకేతిక ఆధారాలతో బెంగుళూరులో నిందితుడిని పట్టుకు ని పీలేరు ఏఎస్‌జే కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. నిం దితుడ్ని పట్టుకున్న ఏఎస్‌ఐ మోసె స్, సిబ్బంది వేణుగోపాల్, రవిశేఖ ర్‌లను జిల్లా అధికారు లు అభినందించారు.