అంగన్వాడీలపై ఏపీ సీఎం జగన్ రెడ్డి కక్ష కట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకుండా నిర్బంధాలు, అక్రమ అరెస్ట్లకు పాల్పడ్డారన్నారు. తెలంగాణతో సమానంగా జీతాలు పెంచకపోగా ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. అంగన్వాడీలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారన్నారు. అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు పలుకుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.