అనకాపల్లి జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్‌ను మత్స్యకారులు, గీత కార్మికులు, కొబ్బరి పీచు కార్మికులు, ఎన్‌ఏవోబీ నిర్వాసితులు కలిసి వారి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకున్ననది తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. వేట నిషేధ కాలంలో ఇచ్చే పరిహారం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదన్నారు. మత్స్యకారులకు పనిముట్లు, బోట్లను సబ్సిడీపై టీడీపీ ఇస్తే, వైసీపీ రద్దు చేసిందన్నారు. చంద్రన్న బీమా ద్వారా మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.