నేడు తిరుమల శ్రీవారిని మంత్రి నాగార్జున దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులతో జగన్ మళ్లీ సీఎం అవుతారన్నారు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారన్నారు. ఇప్పటికి ఆళ్ల తమ పార్టీ వాడేనన్నారు. ఎమ్మెల్యేలు ఎవరికీ అసంతృప్తి లేదన్నారు. అందరూ మా వాళ్లేనని నాగార్జున తెలిపారు. అందరం జగన్ కోసం పని చేస్తామన్నారు. నియోజకవర్గం మార్పుపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. వేమూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు పోటీ చేశానన్నారు. జగన్ బొమ్మ పైనే గెలిచానని.. మంత్రిని అయ్యానని నాగార్జున తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సంతనూతలపాడు నియోజకవర్గానికి నన్ను ఇన్చార్జిగా నియమించారన్నారు. జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటి చేస్తానన్నారు. 175 నియోజకవర్గాలలో వైసీపీనే గెలుస్తుందని.. అందులో ఎటువంటి సందేహం లేదని మంత్రి నాగార్జున పేర్కొన్నారు.