వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితం కార్యక్రమంపై అధికారులతో సీఎం ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేపట్టారు. డిసెంబర్ 18న కార్యక్రమం ప్రారంభం నేపథ్యంలో సమావేశం జరుగుతోంది. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టి కృష్ణబాబు, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డికె బాలాజీలు పాల్గొన్నారు.