దాదాపు మూడు నెలల తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గం నాయకులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కుప్పంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని అధినేతకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వివరించారు. కుప్పంలో లక్ష మెజార్టీ దిశగా పని చేయాలని నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కాగా.. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ వేరే కేసులో ఉన్నారని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదులు విన్న న్యాయస్థానం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.
![]() |
![]() |