ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే టిడిపి, జనసేన ప్రభుత్వం రావాలని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పిడుగురాళ్లలో అన్నారు.
కాగా బుధవారం రాత్రి పిడుగురాళ్ల పట్టణంలోని 2వ వార్డులో బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో యరపతినేని పాల్గొన్నారు. ఈ క్రమంలో యరపతినేని ఇంటింటికి వెళ్లి టిడిపి, జనసేన కరపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి, జనసేన నాయకులు, పాల్గొన్నారు.