వినుకొండ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. బుధవారం రాత్రి రామిరెడ్డిపాలెం వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొంది.
ఈ ఘటనలో బైకుపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa