గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 17వ వార్డు, 197వ బూత్ లో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం టీడీపీ నాయకులు గురువారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి మినీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. అశోక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, సిమెంట్ రోడ్లు, పెన్షన్లు, పేదలకు పక్కా గృహాలు మంజూరు చేశారని గుర్తు చేశారు.