కావలి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో భాగంగా ఈనెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడుతున్నట్లు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాద్యక్షుడు మల్లె అంకయ్య తెలిపారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేసి సమ్మె నోటీసును అందచేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోక పోవటంతో సమ్మె చేపట్టక తప్పడం లేదన్నారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు గుంజి కిషోర్, ఎండ్లూరి ఆదినారాయణ, తన్నీరు వెంకటేష్, ప్రభావతి, వేణు,రాజేష్, రమాదేవి, శ్రీనివాసులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.