తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 222వ రోజు గురువారం ఉదయం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తూరు ఎస్వీ కన్వెన్షన్ క్యాంప్ సైట్ నుంచి యువనేత పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా లైను కొత్తూరులో రోడ్డు మార్గంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ మూడవరోజు సమ్మె చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించారు. వారి సమస్యలు, డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. అయితే అంగన్‌వాడీల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఇదివరకే లోకేష్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa