రాష్ట్రంలో తుఫాన్ వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయిందని, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. గువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మొత్తం 440 మండలాల్లో కరవు ఉంటే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు తుఫాన్ వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. ఎన్నికలకు ముందు అందరి తలపై చేయి వేసి తిరిగావు.. ఇప్పుడు పొలాల్లో దిగకుండా షో చేస్తున్నావు.. అని ఆయన అన్నారు. ఓట్లు కోసం ఎత్తులు వేశావు... అన్నివర్గాల ప్రజలను, రైతులను చిత్తు చేశావని, కరవు, తుఫాన్ ప్రాంత రైతుల పిల్లలకు ఫీజు మాఫీ చేయాలి ఆయన డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు క్షేత్ర స్థాయిలో పంట నష్టం పరిశీలించాలని, కేంద్ర బృందాలను కలిసి నష్టం వివరాలను అందచేస్తామని, ఢిల్లీ స్థాయిలో అందరినీ కలుపుకుని పోరాటాన్ని ఉధృతం చేస్తామని రామకృష్ణ అన్నారు.