అనకాపల్లి జిల్లా, యలమంచిలి అసెంబ్లీ నియోజక వర్గంలో టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యలమంచిలి కోర్టు రోడ్డులో పట్టణ ప్రజలు పలు సమస్యలపై లోకేష్‌కు ప్రజలు వినతిపత్రం సమర్పిస్తున్నారు. టిడ్కో ఇళ్లకు గత పాలనలో ఉన్న లబ్ధిదారుల పేర్లను వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ - జనసేన అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్లను పూర్తిచేసి గతంలో లబ్ధిదారులకే ఇళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని యువనేత భరోసా ఇచ్చారు.