అనంతపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల నిరవధిక సమ్మె నిరసన కొనసాగుతుంది. అంగన్వాడి కేంద్రాలు ప్రభుత్వ ఆస్తి అని... వాటి పీడీ శ్రీదేవి మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్‌కు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయంటూ తెలిపారు. పీడీ శ్రీదేవి చేసిన వ్యాఖ్యలపై సీఐటీయూ నేత నాగేంద్ర మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొడితే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారు. తమ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించడం లేదంటూ పీడీ శ్రీదేవిని అంగన్వాడీలు నిలదీశారు. పీడీ శ్రీదేవి వ్యవహార తీరుపై సీఐటీయు అంగన్వాడీలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.