రుషికొండపై పనులకోసం ఏపీటీడీసీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని గతంలో రామకృష్ణబాబు, మూర్తి యాదవ్‌లు హైకోర్టును అభ్యర్థించారు. ‘‘రుషికొండపై పర్యాటకుల కోసం పరిమితులతో కూడిన అనుమతిని మాత్రమే కేంద్ర అటవి పర్యావరణ మంత్రిత్వశాఖ ఇచ్చింది. కానీ ఏపీటీడీసీ ఉద్దేశపూర్వకంగా వాటిని ఉల్లంఘించింది. కమిటీ పరిశీలనలో ఇది నిజమని తేలితే ఆ కార్పొరేషన్‌కు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలి అని వారు కోరారు.