చంద్రయాన్-3 సక్సెస్‌తో జోష్‌పై ఉన్న ఇస్రో జాబిల్లి తదుపరి ఉపరితలం నుంచి కొన్ని రాళ్లను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ కొన్ని విషయాలను వెల్లడించారు.
జాబిల్లిపై తమకున్న ఆసక్తి ఇంకా చల్లారలేదని, త్వరలో చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లను భూమిపైకి తీసుకువస్తామని చెప్పారు. ఇది అంత తేలికైన లక్ష్యం కాదని సోమనాథ్ తెలిపారు.