సరకు రవాణా వాహనదారులు ఏటా త్రైమాసికానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నును రాష్ట్ర ప్రభుత్వం 20 నుంచి 30 శాతం పెంచేసింది.
ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా గతంలో రూ.200 చెల్లించే గ్రీన్ ట్యాక్స్ ను ఇప్పుడు గరిష్ఠంగా రూ.26,800 చెల్లిస్తున్నారు. అంటే దాదాపు 134 రెట్లు పెంచేశారు. కోవిడ్ తో కుదేలైన రవాణారంగంను ఆదుకోవాల్సింది పోయి పన్నుల భారం వేయడం తగదని యజమానులు వాపోతున్నారు.