నెల్లూరు జిల్లా, కావలి బైరాగుల కాలనీకి చెందిన దద్దు వరలక్ష్మి ఇల్లు అగ్నిప్రమాదానికి గురికావటంతో గురువారం ఆమెను టీడీపీ నేత కావ్య కృష్ణారెడ్డి పరామర్శించి, రూ.50,000 ఆర్థిక సహాయం అందించారు. ఆయన వెంట మాజీ కౌన్సిలర్ సన్నిగంటి భాస్కర్, 18వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి శానం హరి తదితరులు ఉన్నారు. కాగా రెడ్‌క్రాస్ బృందం వరలక్ష్మికి తక్షణ సహాయ సామగ్రిని అందచేశారు. ఈ సామగ్రిని జిల్లా రెడ్‌క్రాస్ తరపున అందచేసినట్లు కావలి రెడ్‌క్రాస్ చైర్మన్ డీ. రవిప్రకాష్ తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ దామిశెట్టి సుదీర్ నాయుడు, జిల్లా పాలక మండలి సభ్యుడు ప్రసన్నాంజనేయులు, కలికి శ్రీహరిరెడ్డి, కనపర్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.