ప్రతిపక్షనేతగా అంగన్వాడీలు నా అక్కచెల్లె మ్మలంటూ తలలు నిమురుతూ నేనున్నా నంటూ హామీలు ఇచ్చిన వైఎస్ జగన్ నాలుగేళ్లలో వారిని మోసం చేశారని పులి వెందుల ననియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవి ధ్వజమెత్తారు. గురువారం అంగన్వాడీ ల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపి సమ్మెలో కూర్చున్న ఆయన వారి డిమాండ్ల ను తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో చాలీచాలని వేతనాలతో చిన్నపిల్ల లకు, గర్భిణులకు, బాలింతలకు అందిస్తు న్న సేవలను అంగన్వాడీలు వివరించారు. అనంతరం బీటెక్ రవి మాట్లాడుతూ వైఎస్ జగన్ పాదయాత్రలో భాగంగా తెలంగాణ లో ఉన్న బెనిఫిట్స్ కంటే ఎక్కువ ఇస్తామ న్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే బెనిఫిట్స్ అమలుచేస్తామని చెప్పిన జగన్ మాట తప్పి అంగన్వాడీలను మోసం చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో అంగ న్వాడీలకు రూ.10500 చేస్తే వైసీపీలో రూ.1000 పెంచారన్నారు. మిగిలిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, చెప్పేవన్ని అబ ద్దాలే అని ఆరోపించారు. ఆదాయపన్ను సీలింగ్ పెట్టి వీరికి రూ.11వేలు జీతం వస్తోందని సంక్షేమ పథకాలు ఆపేయడం దారుణమన్నారు. పోనీ ప్రభుత్వ అధికారు లుగా చూస్తున్నారా అంటే అదీ లేదన్నారు. పింఛన్ సౌకర్యం లేదన్నారు. జీతాలు పెంచకపోగా పెంచిన ధరలకు అనుగుణం గా చేతినుంచి డబ్బు పెట్టుకుని చేస్తుటే ఆ బిల్లులు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. వీరి సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసు కెళ్లి మేనిఫెస్టోలో చేర్చి న్యాయం చేస్తామని ఇప్పటికే ఆయన చెప్పారన్నారు. ఇంత వర కు ఇబ్బందులు పడ్డారు మరో మూడు నాలుగు నెలలు ఓపికి పట్టండి వచ్చేది టీడీపీ ప్రభుత్వమే మీ సమస్యలు పరిష్కా రం అవుతాయని అంగన్వాడీలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.