చంద్రబాబు హయాంలో తుఫాన్లు, కరువు సంభవించినప్పుడు ఎంత నష్టపరిహారాన్ని కేంద్రం నుంచి సాధించారు? ఎన్ని రోజులకు, ఎంత పరిహారం పంచారో స్పెషల్ డిబేట్ పెడతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..... ‘తుఫాన్ బాధితులకు గతంలో కంటే మెరుగైన సాయం అందిస్తాం. రూ.3,800 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చాం. ఎన్యూమరేషన్ జరుగుతోంది. కరువు, తుఫాన్‌పై కేంద్ర బృందం పరిశీలిస్తోంది. ఆ బృందంతో సీఎం చర్చిస్తున్నారు’’ అని మంత్రి వేణు తెలిపారు.