వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్ యాత్ర లో భాగంగా మంత్రి గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ... మన ముఖ్యమంత్రి జగనన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు పెద్దపీట వేశారు. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉంటుందని నమ్మకం కలుగుతుందన్నా, మనకుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయన్నా.. అదంతా ముఖ్యమంత్రి జగనన్న వల్లనే.నాలాంటి వారి తలరాత మార్చింది ముఖ్యమంత్రి జగనన్నే. వెనుకబడిన వర్గాలకు పెద్ద అండ జగనన్న అని అన్నారు.