తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల ధర్నాల్లో భాగంగా పులివెందుల పట్టణంలో గత 8 రోజులుగా ధర్నా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నా మంగళవారం కూడా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది అంగన్వాడీలు, ఆయాలు వంట వార్పూ కార్యక్రమాలలో పాల్గొని దీక్షలను కొనసాగించారు.