అంగన్ వాడీ కార్యకర్తల నిరసన మంగళవారం నాటికి 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు చిలమత్తూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వంటా వార్పు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ ఇందులో అంగణవాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు శోభారాణి, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, సీఐటీయు మండల కార్యదర్శి వెంకటేష్, లక్ష్మినారాయణ, రామచంద్ర తదితరలు పాల్గొన్నారు.