కుల, మత బేధాలను పక్కనపెట్టి అందరూ సోదరభావంతో మెలగాలని వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం హిందూ, ముస్లిం సోదర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముస్లిం నగారా అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు రామ్ ప్రసాద్ బిస్మిల్, అశ్వాఖుల్లా ఖాన్ ను బ్రిటీషర్లు ఉరి తీసిన రోజును హిందూ, ముస్లీం సోదర దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకుంటున్నామన్నారు.