కాకినాడ జిల్లా అన్నవరంలో మంగళవారం ఏపీ దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించారు.
అన్నవరంలోని రత్నగిరిపై రూ.25 కోట్లతో నిర్మించిన శివసదన్, యాత్రికుల విశ్రాంతి భవనాలు, ఘాట్ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.1,400 కోట్లతో ముఖ్య దేవాలయాలను అభివృద్ధి చేశామని తెలిపారు.